- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సామాజిక కార్యకర్త తానికొండ దామోదర్‌రావు ఏఐసీసీ ఎస్సీ విభాగం జాతీయ కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి ఏఐసీసీ ఎస్సీ విభాగం జాతీయ చైర్మెన్ డాక్టర్ రాజేంద్రపాల్ గౌతం, పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆమోదం తెలిపారు. పార్టీ తనకప్పగించిన బాధ్యతను నూటికి నూరు పాళ్లు న్యాయం చేస్తానని దామోదర్ రావు ఈ సందర్భంగా తెలిపారు. అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం తన కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.
- Advertisement -



