నిమ్స్‌లో అక్యూట్ ద్వారా అత్యాధునిక చికిత్స
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వాస్క్యులర్ సర్జరీ విభాగం వైద్యులు అత్యాధునిక యాంజియోజెట్ పార్మాకో-మెకానికల్ థ్రోంబెక్టమీ విధానాన్ని సక్సెస్‌గా వినియోగించారు. అక్కూట్ డీప్ వియన్ త్రంబోసిస్ తో బాధపడుతున్న రోగికి విజయవంతంగా చికిత్స అందించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం, బయ్యారం గ్రామానికి చెందిన 39 ఏండ్ల కొలిచేల్మి రజినీకి ఈ అత్యాధునిక చికిత్సను నిమ్స్‌లో తొలిసారిగా నిర్వహించారు. డీప్ వియన్ త్రంబోసిస్ అనేది కాళ్లలోని లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టే తీవ్రమైన వ్యాధి. సకాలంలో చికిత్స అందించకపోతే ఆ గడ్డ ఊపిరితిత్తులకు చేరి పల్మనరీ ఎంబాలిజంకు దారితీసి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.ఈ చికిత్సలో ఉపయోగించిన యాంజియోజెట్ పార్మాకో-మెకానికల్ థ్రోంబెక్టమీ పద్ధతిలో ముందుగా రక్తం గడ్డను కరిగించే ప్రత్యేక ఔషధాలను నేరుగా ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టి, అనంతరం యాంజియోజెట్ పరికరం సహాయంతో ఆ గడ్డను వేగంగా తొలగిస్తారు. దీనివల్ల రక్తప్రసరణ తక్షణమే పునరుద్ధరించ డటంతోపాటు రోగి త్వరగా కోలుకునే అవకాశం పెరుగుతుంది. అలాగే భవిష్యత్‌లో కాళ్ల వాపు, నొప్పి వంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుంది.
నిమ్స్ కు గర్వకారణం: డైరెక్టర్ రాహుల్ దేవరాజ్
సుమారు రూ.5 లక్షల వరకు ఉండే చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తి చేశామని డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. అత్యాధునిక వైద్య చికిత్సలను ప్రజలకు అందించడం నిమ్స్‌కు గర్వకారణమన్నారు.
ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించిన వాస్క్యులర్ సర్జరీ విభాగం హెచ్ ఓడీ డాక్టర్ సందీప్ మహాపాత్ర, డాక్టర్ అనూష, డాక్టర్ అరుణశ్రీ, డాక్టర్ ఊహ, డాక్టర్ శ్రీనిధి, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ అమర్‌నాథ్, డాక్టర్ త్రివిక్రమ్, డాక్టర్ కీర్తన, డాక్టర్ నలిన్ కృష్ణ, డాక్టర్ నరేన్తో, సహకరించిన అనస్థీషియాలజీ విభాగం, క్యాథ్ ల్యాబ్ బృందం, నర్సింగ్ సిబ్బంది, ఇతర అనుబంధ వైద్య సిబ్బందిని డైరెక్టర్ అభినందించారు.
యాంజియోజెట్ విధానంతో‘టీవీటీ’కి చెక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



