Saturday, June 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజూనియర్ లెక్చరర్లకు వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి

జూనియర్ లెక్చరర్లకు వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి

- Advertisement -

తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేఎ‌ల్‌ఏ-475) డిమాండ్
మద్దతు ప్రకటించిన టీజీఓ నేతలు,
హైకోర్టు అడ్వకేట్స్

నవతెలంగాణ-సుబేదారి
‘ఫ్రెండ్లీ గవర్నమెంట్‌’ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్లకు ప్రొబేషన్ డిక్లేర్ చేయకపోవడం శోచనీయమని, వెంటనే డిక్లేర్ చేయాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేఎల్‌ఏ-475) రాష్ట్ర కౌన్సిల్ డిమాండ్ చేసింది. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణ లోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవనంలో టీజీజేఎ‌ల్‌ఏ-475 రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2023 బ్యాచ్ లెక్చరర్ల సమస్యలపై పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్మోహన్‌రావు మాట్లాడుతూ.. తక్షణమే 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్లకు ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ప్రొబేషనరీ డిక్లరేషన్‌ను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే లెక్చరర్లు చేపట్టే ప్రతి నిరసన కార్యక్రమానికి టీజీఓ తరపున పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. అనంతరం హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ జీవీఎల్ మూర్తి మాట్లాడుతూ.. ప్రొబేషన్, ఇంక్రిమెంట్ల సాధనలో తలెత్తే ప్రతి న్యాయపరమైన అంశంలోనూ పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకూ తమ లాయర్ల బృందం అధ్యాపకులకు తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. టీజీఓ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆసనాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంట్రా క్టు వ్యవస్థ ప్రారంభం నుంచి తాము లెక్చరర్లకు తోడుగా ఉన్నామని, భవిష్యత్తు పోరాటాల్లోనూ తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

టీజీజేఎలఏ-475 రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 2023 మే 4న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించిందని, మూడేండ్లు గడుస్తున్నా ఇంతవరకు ప్రొబేషన్ డిక్లేర్ చేయకపోవడం అన్యాయమన్నారు. దళారుల వలలో చిక్కకుండా, న్యాయపోరాటం ద్వారానే హక్కులను సాధించుకుందా మని అధ్యాపకులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వస్కుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే పోరాటాల గడ్డ అయిన ఓరుగల్లు వేదికగా మరోసారి ఉధృత ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అధ్యాపకు లెవరూ ఆందోళన చెందవద్దని, కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావ ేశంలో రాష్ట్ర కోశాధికారి నాయిని శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేమిడి మల్లారెడ్డి, గోస్కుల హరగోపాల్ యాదవ్, రాష్ట్ర మహిళా సెక్రటరీ షహీన బేగం, రాష్ట్ర నాయకులు జె. కురుమూర్తి, శోభన్ బాబు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు బుచ్చిరెడ్డి, సంపత్, షాఫీయుద్దీన్, ఉష్కమల్ల శ్రీనివాస్, జోగ్య నాయక్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నేతలు గణపతి, రాజిరెడ్డి, అనిల్ కుమార్, రవీందర్, భాస్కర్, కిరణ్, ఎల్ల స్వామి, శ్రీనివాస్, రవికిరణ్, గణేష్, రమాదేవి, కల్పన, రజిత, శ్వేత, హిమబిందు, శోభ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -