Saturday, June 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవీడిన మర్డర్ మిస్టరీ

వీడిన మర్డర్ మిస్టరీ

- Advertisement -

నల్గొండలో భార్యాభర్తలు, పిల్లలను చంపింది ఒక్కడే
నల్గొండ: నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. దంపతులతో పాటు ఇద్దరు పిల్లలను చంపింది ఒక్కడేనని నిర్ధరించారు. ఇటీవల నల్గొండ తెలంగాణ కాలనీలోని ఇంట్లో భార్యాభర్తలు మహ్మద్‌ సుల్తాన్‌ (45), హసీనా (38)తో పాటు వారి కుమారుడు ముజామిల్‌ (20), కుమార్తె అఫోర (14) హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నెల 20న తెల్లవారుజామున హత్యలు జరగ్గా.. 22న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు సయ్యద్‌ అస్లాం, అతడి భార్య తబస్సుమ్‌తో పాటు వారికి పరోక్షంగా సహకరించిన సోహైల్‌, హేమంత్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్థిక లావాదేవీల కారణంగానే అస్లాం ఘాతుకానికి పాల్పడ్డాడు. అక్క కుమార్తె తబస్సుమ్‌, అస్లాంకు హసీనా ఏడాది క్రితం రూ.లక్ష అప్పు ఇచ్చారు. ఇటీవల మరో రూ.లక్ష కావాలని సుల్తాన్‌, హసీనా దంపతులను అస్లాం అడిగాడు. దానికి హసీనా నిరాకరించారు. గతంలో ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని కోరారు. డబ్బు కోసం ఒత్తిడి చేశారని తబస్సుమ్‌, అస్లాం వారిపై పగ పెంచుకున్నారు. అస్లాం యూట్యూబ్‌లో చూసి హత్యలకు పథకం పన్నాడు. ఈనెల 20 తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వచ్చిన హసీనాను తొలుత చంపాడు. ఆ తర్వాత అరుపుల శబ్దం విని బయటకు వచ్చిన సుల్తాన్‌, ముజామిల్‌ను కూడా అంతమొందించాడు. ఇంట్లో ఉన్న అఫోరను కూడా వదల్లేదు. ఇంట్లోకి వెళ్లి మరీ మంచం కింద దాక్కున్న అఫోరను కడతేర్చాడు. ఈ హత్యల తర్వాత ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలను అస్లాం దోచుకెళ్లాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -