Saturday, June 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇక"డిజిటలైజేషన్"

ఇక”డిజిటలైజేషన్”

- Advertisement -

ఓయూ దూరవిద్య కేంద్రంలో సమూల మార్పులు
బుక్స్ ప్రింటింగ్‌‌కు చెక్..
నేరుగా అభ్యర్థుల లాగిన్‌‌కు ఈ-బుక్స్
యూజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం
సర్టిఫికేట్స్‌‌ కోసం ఆన్ లైన్‌‌లోనే దరఖాస్తులు
ఏఐ ద్వారా సందేహాల నివృత్తి

నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
మారుతున్న కాలానికి అనుగుణంగా వందేండ్లకు పైగా చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీ కూడా అనేక మార్పులు చేసుకుంటోంది. ప్రస్తుత టెక్నాలజీతో అనుసంధానించుకుంటూ ఆన్ లైన్ సేవలను అందిపుచ్చుకుంటోంది. దానిలో భాగంగానే 48 ఏండ్ల ప్రొఫెసర్ జి.రాం రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్ సీడీఈ ) సమూల మార్పులు చేపట్టింది. దానికి ఈ నెల 25న జరిగిన అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆమోదం పొందటంతో ఆగస్టు నుంచి పూర్తిస్థాయిలో ఈ సెంటర్ “డిజిటలైజేషన్” దిశగా డెరైక్టర్ ప్రొ.ఎన్.సిహెచ్.భట్రాచార్యులు ప్రయత్నం చేస్తున్నారు. డిజిటలైజేషన్ లో భాగంగా సిలబస్ కాఫీలను అభ్యర్థులకు సాఫ్ట్ కాపీ రూపంలో వెబ్ సైట్‌‌లో ఉంచనున్నారు. వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందుతున్న అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ లో” ఏఐ” టెక్నిక్స్ ద్వారా నివృత్తి చేసుకోడానికి సౌకర్యం కల్పించారు.

2026-2027 విద్యాసంవత్సరం సంస్థల నుంచి ఇంటర్నల్స్ అన్నీ ఆన్ లైన్ విధానం ద్వారా నిర్వహించనున్నారు. దీనిద్వారా ప్రతి అభ్యర్థీ ఇంట్లో ఉండే ఇంటర్నల్స్ రాసుకునే వెసులుబాటు తీసుకురానున్నారు. అభ్యర్థులు సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి సెంటర్ కు రాకుండా ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్స్, మైగ్రేషన్ సర్టిఫికెట్, బోనోఫైడ్ లాంటి అన్ని సర్టిఫికెట్స్ కోసం కూడా ఆన్ లైన్ ద్వారా అప్లయ్‌ చేసుకుంటే ఇంటికే వచ్చేలా మార్పు తీసుకురానున్నారు. గతంలో ఉన్న సెంటర్ లో కౌంటర్ స్థానంలో ఐదు “సింగిల్ విండో కౌంటర్స్ ” అందుబాటులో‌కి తెచ్చారు. ఈ సింగిల్ విండో కౌంటర్స్ లో కౌంటర్ దగ్గర వెయిట్ చేయకుండా, టోకెన్ సిస్టంతో టోకెన్ తీసుకొని వారి నెంబర్ ఎప్పుడు వస్తే అప్పుడు ఏదైనా (టీసీ, బీసీ, ఎంసీ అడ్మిషన్ దరఖాస్తు చేసుకోవడం, వేరిపికేషన్ చేసుకోవటం, ఫీజులు చెల్లించే సౌకర్యం) సర్వీస్ పొందేవిధంగా మార్పు తీసుకొచ్చారు.

​పదిలంగా రికార్డ్స్ ..
48 ఏండ్లుగా ఉన్న పూర్వ విద్యార్థుల రికార్డ్స్ అన్నీ భద్రంగా ఉండేందుకు “రికార్డ్స్ సెక్షన్”ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇలా సుమారు 15 లక్షల వరకు రికార్డ్స్ ను భద్రపరిచారు. 2026 – 2027 విద్యా సంవత్సరంలో 50 సర్టిఫికెట్స్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. విద్యార్థులకు నూతనంగా “మొబైల్ యాప్ ” ద్వారా సమస్త సమాచారాన్ని చేరవేసేందుకు కృషి జరుగుతోంది.

​కొత్త పరికరాలు..
​డిజిటలైజేషన్ లో భాగంగా 30 నూతన కంప్యూటర్స్ తోపాటు రెండు సర్వర్స్, సాఫ్ట్‌‌వేర్‌ కొనుగోలు కోసం అడ్వైజరీ కమిటీ అనుమతి పొందింది. గత సెమిస్టర్ నుం‌చి అన్నీ ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అభ్యర్థులు ఎవరూ సెంటర్‌‌కు రాకుండా పైసా ఖర్చు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రొఫెసర్ భట్రాచార్యులు తెలిపారు. అన్ని అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ సిస్టంలో మారుతున్నట్టు చెప్పారు. దీంతోపాటు 2026 -2027 విద్యా సంవత్సరంలో సుమారు ఒక కోటి పైగా బుక్స్ ప్రింటింగ్ కోసం వెచ్చిస్తున్న విషయం తెలిసిందే. ఇకపై దాన్ని స్థానంలో అభ్యర్థులకు నేరుగా వారి లాగిన్స్ కు “ఈ – బుక్స్ “ను చేరవేస్తామని భట్రాచార్య పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -