రెంజల్ మండలం నీల గ్రామంలోని 17 గణేష్ మండపాలకు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి శనివారం10 క్వింటాళ్ల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల సాంప్రదాయాలకు, హిందువుల ఐక్యతకు తానెప్పుడు ముందుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఖ్యాతం యోగేష్, రవి, శివశంకర్, అనిల్, రమేష్, జనార్ధన్, రాజేందర్, సాయి, తదితరులు పాల్గొన్నారు.