నవతెలంగాణ-భిక్కనూర్:
ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ముందు శనివారం శాంతియుత సమ్మెను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి చాలీచాలని జీతాలతో ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం అమలు చేయడం లేదని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించి, ఈఎస్, ఐపిఎఫ్ సౌకర్యాలు అమలు చేయాలని సమస్య పరిష్కారం అయ్యేవరకు శాంతియుత సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.