వక్ఫ్‌షాపింగ్‌ కాంప్లెక్స్‌ స్వాధీనం

– అద్దెలు వక్ఫ్‌బోర్డుకు చెల్లించాల్సిందే
– వక్ఫ్‌ ఆస్తుల సమగ్ర విచారణ నివేదిక బోర్డుకు సమర్పిస్తాం
– వక్ఫ్‌ బోర్డ్‌ ఓఎస్డి మహమ్మద్‌ సాదత్‌
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలోని వక్ఫ్‌ ఆస్తులను వక్ఫ్‌ బోర్డు సిఇఓ ఆదేశానుసారం స్వాధీనం చేసుకుంటున్నట్లు బోర్డు ఓఎస్డి మహమ్మద్‌ సాదత్‌ తెలిపారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపుర (చోట ఆశరానా) షాపింగ్‌ కాంప్లెక్స్‌, కుండల బజార్‌ లోని (బడా ఆషుర్‌ ఖానా) వక్ఫ్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ లోని ప్రతి షాపుకు బోర్డు అధికారులు వెళ్లి షాపులలో కిరాయిదారులకు ఎంతకాలం నుంచి షాపులో కిరాయికి ఉంటున్నారు, ప్రతినెల షాపు కిరాయి ఎంత..? ఎంత చెల్లిస్తున్నారు.? మీ షాపు కరెంటు మీటర్‌ ఎవరి పేరు మీద ఉన్నది.. బిల్లు, కిరాయి ఎవరికి చెల్లిస్తున్నారు, రసీదు తదితర జిరాక్స్‌ కాపీలను సమగ్ర వివరాలను బోర్డు అధికారులు సేకరించి రికార్డు చేశారు. వక్ఫ్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ లోని ప్రతి షాపు కిరాయి ఇకనుంచి బోర్డు అధికారికే చెల్లించాలని వారు సూచించారు. షాపుల కిరాయి విషయంలో బోర్డు అధికారి తప్ప ఇతరులకు జోక్యం ఉండదన్నారు. ఈ విషయంపై ఓఎస్డి సదత్‌ విలేకరులతో మాట్లాడుతూ కాంప్లెక్స్‌ షాపుల నిర్వహణ అద్దే బకాయిలలో ఆవక తవకలు జరిగినట్లు బోర్డుకు ఫిర్యాదు అందడంతో 2022 ఆగస్టు నెలలో విచారణ జరిపి మూడు రోజుల్లోగా అద్దె బకాయిల సంబంధించిన వివరాలు, రసీదు బుక్‌ షాపుల నిర్వహణ రికార్డులను సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. సంబంధిత నిర్వాహకులు ఒక నెల లోగా రికార్డు సమర్పిస్తామని గడవు తీసుకోవడం జరిగిందన్నారు. నేటి వరకు షాపుల అద్దె బకాయిలు తదితర వివరాల సంబంధించిన ఎలాంటి రికార్డు, రసీదు బుక్‌ లు, బ్యాంకు అకౌంట్స్‌, డాక్యుమెంట్స్‌, తదితర వివరాలు ఏవి సమర్పించలేదన్నారు. వక్ఫ్‌ బోర్డు సీఈవో ఆదేశానుసారం సమగ్ర విచారణ జరుపుతున్నామని నివేదికను సీఈఓ కు అందజేస్తామన్నారు. షాపుల లను స్వాధీనం చేసుకున్నామని, ఇకనుంచి వక్ఫ్‌ బోర్డు పర్యవేక్షణలో షాపుల నిర్వహణ ఉంటుందన్నారు. ఎప్పటి నుండో తక్కువ అద్దెలపై ఉంటున్నారన్న విషయాన్ని నివేదిక సిఇఓకు సమర్పిస్తామని తెలిపారు. దుకాణాలకు తిరిగి టెండర్‌ విషయం బోర్డు పరిశీలిస్తుందని తెలిపారు. ఆయన వెంట వక్ఫ్‌ బోర్డు ఆడిట్‌ ఇన్స్పెక్టర్‌ షేక్‌ మహిముద్‌, సర్వేయర్‌ సుజాత్‌ అలీ ఖాన్‌, రెంట్‌ కలెక్టర్‌ జానీ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శ్యామ్‌ పాల్గొన్నారు.

Spread the love