Friday, May 16, 2025
Homeతెలంగాణ రౌండప్సీసీ రోడ్డుకు ఇరువైపులా మొర్రం వేయాలి..

సీసీ రోడ్డుకు ఇరువైపులా మొర్రం వేయాలి..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సహకారంతో సిసి రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేశారు. కానీ సీసీ రోడ్డుకు ఇరువైపులా మొర్రం వేయలేదు. దీంతో చిన్నపాటి వర్షానికే ఇండ్ల ముందర వర్షపు నీరు నిండిపోయి, బాటసారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీసీ రోడ్డు నిర్మాణ పనులను గుత్తేదార్ అస్తవ్యస్తంగా వేశారని స్థానికులు అంటున్నారు. రోడ్డుకు ఇరువైపులా మొరం పనులు చేపట్టి, ఇండ్ల ముందర నీటి నిలువ లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను జనాలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -