మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
సుంకేట రవి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల విభాగాలను కూడా నియమించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన అధ్యక్షుడిగా రేవతి గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా గోపిడి రాజేశ్వర్, ఉపాధ్యక్షుడిగా మేకల క్రాంతి, కార్యదర్శిగా ఎడ్ల శ్రీకాంత్, గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బద్దం రవి, ఉపాధ్యక్షుడిగా ఆలకుంట శేఖర్, కార్యదర్శిగా చిటిమెల సృజన్, హరిజన విభాగం అధ్యక్షుడిగా మోదీని శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా పోడేటీ అనిల్, ఉపాధ్యక్షుడిగా మేకల రంజిత్, కార్యదర్శిగా చెరుకు రాకేష్, బీసీ విభాగం అధ్యక్షుడిగా ఏదుల రాజేందర్, కార్యదర్శిగా మామిడి మధు, గిరిజన విభాగం అధ్యక్షుడిగా పెద్ది సృజన్ లను నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, న్యాయవాది ఏలేటి గంగాధర్, జిల్లా కిసాన్ కేత్ ఉపాధ్యక్షుడు పడిగేలా ప్రవీణ్, మండల బిసి సెల్ అధ్యక్షుడు కుందేటి శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.