- Advertisement -
నవతెలంగాణ – బంజారా హిల్స్
ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి అనుమానాస్పద మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎస్.ఆర్.నగర్ లోని బాపూనగర్ మెయిన్ రోడ్లోని రూమ్ లో అద్దెకు ఉంటున్న గోవర్ధన్ (42) అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం, పూర్తి ఆధారాలు సేకరించి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
- Advertisement -



