నవతెలంగాణ-రాజంపేట్: రాజంపేట మండలం కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం తగదని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యాదవ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి హరీష్ రావు బిచ్కుంద పర్యటన హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతున్నారు. కానీ స్థానిక పోలీసులు గురువారం అర్థరాత్రి రాజంపేట మండల కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు. అరెస్ట్ అయిన వారు మండల యువత అధ్యక్షులు అంకం కృష్ణ రావు, పట్టణ అధ్యక్షులు రంగ గంగాధర్ గౌడ్, పట్టణ యువత అధ్యక్షులు మీర్ షాదుల్,బీసీ సెల్ అధ్యక్షులు టి సిద్ధిరాములు, ఎన్ఎస్సిఐ మండల శాఖ అధ్యక్షులు షేక్ జమీల్,మైనార్టీ నాయకులు అప్సర అలీ, అల్తాఫ్, మీరు వజిత్ ఆలీ, బోయిన రమేష్ తదితరులను అరెస్ట్ చేశారు.