నవతెలంగాణ-మోపాల్ : మోపాల్ మండలంలో గల మండల పరిషత్ ఆఫీస్ ముందు శుక్రవారం రోజున రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశానుసారం స్థానిక ఎంపీపీ లతా కన్నిరం జడ్పిటిసి కమలా నరేష్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన మైనార్టీ మహిళలకు 20 కుట్టుమిషన్లను మండల కోఆప్షన్ సభ్యుడు అజీమ్ చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ జెడ్పిటిసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కెసిఆర్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని దీనిలోని భాగంగానే మహిళలు కూడా స్వశక్తి పైన ఎదగాలనే ఉద్దేశంతో పురుషులతో సమానంగా పోటీ పడాలనీ రాష్ట్ర ప్రభుత్వం కుట్టుమిషన్లను పంపిణీ చేయడం జరిగింది దానితోపాటు వివిధ కార్యక్రమాలు చేపట్టి మహిళలకు తోడుగా నిలుస్తుంది వారు తెలిపారు. జడ్పిటిసి నరేష్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితక్క పోరాటం వల్లనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సాధ్యమైందని రాబోయే ఎన్నికల్లో మన కవితక్కని మరియు బాజిరెడ్డి గోవర్ధన్ నీ కచ్చితంగా గెలిపించుకోవాలనీ వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచి సిద్ధార్థ, ముత్యం రెడ్డి, భూషణ్, రవి, భరత్ సాయి రెడ్డి, ఎంపీడీవో లింగం నాయక్, ఎంపీఓ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.