బోర్గంలో సిసి రోడ్డు ప్రారంభం

నవ తెలంగాణ-రెంజల్:
రెంజల్ మండలం బోర్గం గ్రామంలో సిసి రోడ్డు పనులను జెడ్పిటిసి మేక విజయ సంతోష్, గ్రామ సర్పంచ్ పార్థ వాణి సాయి రెడ్డి, ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పరిషత్ నిధుల నుంచి తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు కాగా పట్టి నిధులతో పనులను ప్రారంభించామన్నారు . నాణ్యతతో కూడిన పనులు జరిపించాలని వారు కాంట్రాక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఫెరోజ్ ఉద్దీన్, ఎంపీటీసీ రుక్మిణి, ఏంజెల్ సింగిల్ విండో చైర్మన్ మొహీనుద్దీన్, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.
Spread the love