గ్రామీణ ఉపాధి హామీ చట్టం కోసం అక్టోబర్ 11న దేశ వ్యాప్త ఆందోళనలు

– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ 
నవతెలంగాణ కంఠేశ్వర్: అక్టోబర్ 11న గ్రామీణ ఉపాధి హామీ చట్టం కాపాడుకుందామనే నినాదంతో దేశవ్యాప్తంగా మండల కేంద్రాలలో జరుగుతున్న ఆందోళనలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం వేశాల గంగాధర్ అధ్యక్షతన జరిగింది.సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి పనిని తీసివేయాలని అనేక చర్యలను చేపట్టింది దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 15 కోట్ల కుటుంబాలలోని జాబ్ కార్డుదారు లకు నగదు రహిత చెల్లింపులు పేరుతో కూలీల బ్యాంకు ఎకౌంటు, ఆధార్ కార్డు, ఉపాధి హామీ పని జాబ్ కార్డు లను యాప్ ద్వారా అనుసంధానం చేయాలని రాష్ట్రాలకు డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న వేతనాలు చెల్లింపును ఆన్లైన్ పేమెంట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్నది ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించడమే బ్యాంక్ అకౌంటు లేని ఆదివాసి గిరిజన ప్రాంతాలు గ్రామీణ రిమోట్ ప్రాంతాలు లో ఉన్న పేదలు బ్యాంకులు అందుబాటులో లేకపోవడం వలన ఉపాధి జాబ్ కార్డు ఉన్నా కూడా పనికి దూరం అయ్యే ప్రమాదం ఏర్పడింది. పనిచేసిన కూలీలకు బ్యాంక్ ఎకౌంటు లేకపోవడం వలన వేతనాలు కేంద్ర ప్రభుత్వం వేయడం లేదు. గత సంవత్సరం చేసిన పనికి నేటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదు. ఉపాధి పనికి వెళ్లిన ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు అనే అభద్రతాభావం లోకి పేదలు వెళ్లారు. కూలీలే తమంతట తాము ఉపాధి పనికి దూరమయ్యేటట్లుగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఇది జాబ్ కార్డు కలిగిన పేదలందరికీ ప్రభుత్వమే పని చూపించాలి అనే బాధ్యతనుండి తప్పుకునే చర్య. సుమారుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా తప్పు పట్టింది. గత సంవత్సరం 93 వేల కోట్లన్న బడ్జెట్ ను 63 వేల కోట్ల రూపాయలకు కుదించింది. రాష్ట్ర ప్రభుత్వం క్యూబిక్ మీటర్ల కొలతల ఆధారంగా వేతనాలు చెల్లింపు చర్యలకు పూనుకున్నది. ఫలితంగా అడిగిన వారందరికీ పనిని ప్రభుత్వం చూపలేకపోతున్నది రోజు మొత్తం పనిచేసిన వేతనాల్లో భారీ కోత విధిస్తున్నది చట్ట ప్రకారం రోజు కూలి 272రూపాయలు చెల్లించాల్సి ఉండగా తెలంగాణ రాష్ట్రంలో 120 రూపాయలకు మించి కూలి చెల్లించడం లేదు చాలా గ్రామాలలో 60 రూపాయల లోపల వేతనం పడుతున్నది. చేసిన పనికి వారం రోజుల్లో వేతనాలు చెల్లించాలని నిబంధన ఎక్కడ అమలు కావడం లేదు. కొత్త జాబ్ కార్డులు ఇవ్వడం లేదు. కొత్తగా పేర్లను చేర్చడం లేదు. వికలాంగులు, వితంతువులు, ఎస్సీ, ఎస్టి తరగతులకు ప్రత్యేక పనులు పెట్టాలని చట్టం సూచించిన డైరెక్షన్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. ఎస్సీ , ఎస్టీల బీడు భూముల లెవలింగు, కాలవల నిర్మాణం, చౌడు భూములకు ఒండ్రు మట్టి తోలకం, పచ్చిక బైళ్ళ పెంపకం వంటి పనులను చిన్న సన్న కారు రైతుల భూముల అభివృద్ధి పనులను పెట్టడానికి పాలకులు సిద్ధపడటం లేదు. ఈ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట రాములు గోళం లక్ష్మి, శశికళ జిల్లా ఉపాధ్యక్షురాలు నర్రా శంకర్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వరి, కళ, చంద్రకాంత్, లక్ష్మీనరసయ్య జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love