కానిస్టేబుళ్లుగా ఎంపికైన యువతకు సన్మానం

నవతెలంగాణ-రాజపేట
రాజపేట మండలం కుర్రారం గ్రామానికి చెందిన సంపత్‌, నరేష్‌లు, కానిస్టేబుల్లు గా ఎంపికవడంతో కుర్రారం రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. జాల గ్రామంలో కానిస్టేబుల్‌గా ఎన్నికైన కర్ణాకర్‌ను గ్రామపంచాయతీ వద్ద సర్పంచి గుంటి మధుసూదన్‌ రెడ్డి, గ్రామస్తులు సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కుర్రారం రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు రావి కొండల్‌ రెడ్డి మాట్లాడుతూ కురారం గ్రామానికి చెందిన యువకులు సంపత్‌, నరేష్‌ లు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికవడం హర్షించదగిన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కురారం గ్రామ ఉపసర్పంచ్‌ బూత్కూరు నర్సిరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు రేకులపల్లి మల్లారెడ్డి, కత్తుల అంజిరెడ్డి, రొండ్ల రాంరెడ్డి, పెంటపర్తి నారాయణరెడ్డి, పెంటపర్తి రాజిరెడ్డి, మల్లారెడ్డి, మోహన్‌ రెడ్డి, మాధవరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love