- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో బుధవారం కాటారం ఎక్సైజ్ శాఖ అధికారులు, కాటయ్య సెప్టి కిట్స్ ట్రైనర్స్ మ్యాడగొని భుచ్చయ్య, తోడేటి జితేందర్ గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, వెంగలి తిరుపతి గౌడ్, కట రవిందర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం సంయుక్తంగా గీతా కార్మికులకు ట్రైనింగ్ నిర్వహించారు. త్వరలోనే 100 మంది గీతా కార్మికులకు మోకులు అందజేయునట్లుగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు కిష్టయ్య, వెంకట రాజు, విమల, కోటేశ్వరరావు, తాడిచెర్ల గౌడ సంఘం అధ్యక్షుడు బొబ్బిలి రాజు గౌడ్, గీతా కార్మికులు పాల్గొన్నారు.
- Advertisement -



