• ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్
పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన బైక్ ర్యాలీ
నవతెలంగాణ – పెద్దవంగర
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించాలంటే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ‘మన ఊరు–మన బాధ్యత.. అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని ఉప్పరగూడెం, చిట్యాల, బొమ్మకల్లు, పోచారం, కొరిపల్లి గ్రామాల్లో హెల్మెట్ ధరించి, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనదారులు గమ్యస్థానానికి క్షేమంగా చేరుకోవాలంటే హెల్మెట్‌ను అలవాటుగా ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే పోలీసులు చలాన్లు విధిస్తారన్నారు. ప్రమాదం జరిగితే గాయాలు, ప్రాణనష్టం జరిగి మీకు, మీ కుటుంబానికి నష్టం జరుగుతుందన్నారు. ఇంటి నుంచి వాహనంతో బయటకు వచ్చిన ప్రతిసారి హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ ధరించి, సేఫ్టీ లాక్ బిగించుకుని వాహనం నడుపాలని వాహనదారులకు సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పోలీసులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హెల్మెట్ ఉంటేనే ప్రాణాలకు భరోసా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



