- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు:- మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు 2025లో భాగంగా విద్యార్థులకు చెకుముకి సంబరాలు శుక్రవారం నిర్వహించారు
.మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్టులో పెద్దతూoడ్ల గ్రామ విద్యార్థులు రామ్ చరణ్, అక్షిత, జస్వంత్ లు,మండల స్థాయిలో ద్వితీయ స్థానాన్ని పొందారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.తిరుపతి విద్యార్థులను అభినందించారు.గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు,మెమెంటో అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు సిహెచ్ శర్మ, ఐత మహేందర్, సుజాత, గోపీనాయక్, రవీందర్,ఓఎస్ సందీప్,విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



