Saturday, July 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తండ్రిని, ఇద్దరి పిల్లలను కాపాడిన పోలీసులు

తండ్రిని, ఇద్దరి పిల్లలను కాపాడిన పోలీసులు

- Advertisement -

నవతెలంగాణ-అచ్చంపేట 
మండల పరిధిలోని ఎద్దుమిట్ట తండా గ్రామానికి చెందిన రామావత్ నాగరాజు (36) గత కొన్ని రోజులుగా కుటుంబ విషయమై తన భార్యతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం 10:00 గంటలకు భార్యతో మళ్ళీ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కోపంతో తన ఇద్దరు పిల్లలను తీసుకొని “చనిపోతాను” అని చెప్పి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా వారి ఆచూకీ దొరకలేదు. దీంతో స్తానికులు ఈ సమాచారాన్ని సిద్ధాపూర్ పోలీసులకు అందించారు. వెంటనే స్పందించిన పోలీస్ బృందం తక్షణమే రంగంలోకి దిగారు. సిఐ నాగరాజు పర్యవేక్షణలో, పోలీస్ కానిస్టేబుళ్లు ఎ. సహదేవ్, మాల్య, హరి, అనిల్‌ సంయుక్తంగా వారి మొబైల్ లోకేషన్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపుగా 3 గంటలు శ్రమించి, బాధితుడు నాగరాజుతో పాటు ఆయన ఇద్దరు పిల్లలను సురక్షితంగా ప్రాణాపాయం రక్షించారు. అనంతరం వారికి అవసరమైన కౌన్సెలింగ్ ఇచ్చి, క్షేమంగా వారి బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు సహాయానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దాపురం పోలీసులను అచ్చంపేట సీఐ నాగరాజు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -