ప్రతి ఇంటికి అభివృద్ధి – సంక్షేమ ఫలాలు

– బట్టలు అందంగా మలిచి కుట్టే వాడే ధర్జీ
– వృత్తిని నమ్ముకున్న ధర్జీలకు1 లక్ష రూ. ల ఆర్థిక సహాయం
– ప్రభుత్వ యూనిఫార్మ్ తయారీ లో మేరులకు 50% కేటాయింపు
– నిజామాబాద్ నగరం లో మేరు కులస్తుల ఆత్మ గౌరవానికి ప్రతికగా 40 లక్షలతో భవనం నిర్మాణం
– మరోసారి అవకాశం ఇవ్వండి
– ధర్జీల సమస్య లపై అసెంబ్లీ లో మాట్లాడుతా
– మేరు సంఘం ఆత్మీయ సమ్మేళనం లో ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ- కంటేశ్వర్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల శ్రీరామ గార్డెన్స్ లో మేరు ఆత్మీయ సమ్మేళనం లో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  గణేష్ బిగాల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన లో ప్రజలు సుఖ సంతోషలతో ఉన్నారు. నిజామాబాద్ కుల మతాలకు అతీతంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాము. మేరు సంఘం కమ్యూనిటీ హల్ నిర్మాణానికి 40 లక్షల రూ. లు నిధులు మంజూరు చేసాము. ప్రభుత్వం బిసి కులస్థులకు అందించే 1 లక్ష రూ.ల ఆర్థిక సహాయాన్ని మేర కులస్థులకు ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ నగరం లో పోటా పోటీగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసాము. ప్రతి డివిజన్ లో సిసి రోడ్లు, డ్రైనేజి లు నిర్మించాము. స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు ఐటి టవర్ ని నిర్మించాము. వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి న్యాక్ భవనాన్ని నిర్మించాము. వచ్చే తరాల కోసం మంచి నీటి సమస్య రాకుండా మిషన్ భగీరథ పైప్ లైన్ లు నిర్మించాము. ఎల్లమ్మ గుట్ట రైల్వే కామన్ వద్ద ఆర్ యు బి ని నిర్మించాము. స్మశాన వాటిక అనే అనుభూతి కలగకుండా ఆధునిక సదుపాయల తో వైకుంఠదామాలు నిర్మించాము. నిజామాబాద్ లో నిర్మించిన వైకుంఠధామాలు హైదరాబాద్ లో మహా ప్రస్థానం కన్నా బాగా ఉన్నాయని మంత్రి కేటీఆర్  కితబునిచ్చారు. బీ. ఆర్. ఎస్ హయం లో ఆలయాల అభివృద్ధి జరిగాయి.1 కొటి రూ. లతో సారంగాపూర్ హనుమాన్ ఆలయానికి రోడ్డు నిర్మించాము. 50 లక్షల రూ. లతో పెద్దమ్మ గుడి నిర్మిస్తున్నాము. 25 లక్షల రూ. లతో మార్కండేయ మందిరం నిర్మిస్తున్నాము. 50 లక్షల రూ. లతో సంతోషి మాత సాయి బాబా ఆలయం నిర్మిస్తున్నాము. విటలేశ్వర ఆలయనికి కాంప్లెక్స్ లు నిర్మించి శాశ్వత ఆదాయం కల్పించాము. కుల మతం బేధం లేకుండా అభివృద్ధి పనులు చేసాము. మరింత అభివృద్ధి కోసం మరోసారి కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించండి రెట్టింపు ఉత్సాహం తో మరింత అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను.ఈ కార్యక్రమం లో నగర మేయర్  దండు నీతూ కిరణ్ , సిర్ప రాజు,సామ హనుమంతు రావు, కొత్తూరు చంద్ర కాంత్, మంతెన దశరథ్,ఎన్ను సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love