నవతెలంగాణ- కమ్మర్ పల్లి :మండల కేంద్రం నుండి గతంలో ఎంపికైన ముగ్గురు ఆర్మీ జవాన్ల ను చత్రపతి సేన ఆధ్వర్యంలో సన్మానించారు.శనివారం స్థానిక జంబి హనుమాన్ దేవాలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం అనంతరం ఆర్మీ జవాన్లను సన్మానించారు. గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్లు పోల్కం తరుణ్, రిత్విక్, ఎయిర్ ఫోర్సులో జవాన్ హర్షిత్ లను చత్రపతి సేన సభ్యులు కాషాయ కండువాలతో ఘనంగా సత్కరించారు. దేశానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ జవాన్లు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. విధి నిర్వహణలో దేశానికి ఉత్తమ సేవలు అందించడం ద్వారా గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భోగ రామస్వామి, చింత హనుమంతు, ఫలహారం యాదగిరి, రమణయ్య గుప్తా, శంకర్ గుప్తా, నరేందర్ గుప్తా, పసుపుల చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.