గత వారం రోజుల క్రితం ఆనారోగ్యంతో మృతిచెందిన ఓ అనాధ శవానికి అంత్యక్రియలను ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ సోమవారం నిర్వహించారు. 3వ ఠాణా ఏస్.ఐ ప్రవీణ్ అనుమతితో నేడు దుబ్బ రోడ్డులోని సార్వజనిక్ స్మశాన వాటికనందు సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, గౌరవ అధ్యక్షులు మద్ది గంగాధర్, ఈ.సి మెంబర్ కాసుల సాయితేజ, కార్యవర్గ సభ్యులు మయూర్, జయదేవ్ సదరం హోం ఇంఛార్జ్ శ్రీదేవి, సమత, తదితరులు పాల్గొన్నారు.