నవ తెలంగాణ- నవీపేట్: మండలంలోని యంచ చెక్ పోస్టును నిజామాబాద్ ఏసిపి కిరణ్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లలో భాగంగా చెక్ పోస్టును పరిశీలించారు. చెక్ పోస్ట్ సిబ్బందితో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ సతీష్ కుమార్, ఎస్సై యాదగిరి గౌడ్ ఉన్నారు.