అభివృద్ధి పథంలో ఆలేరు నియోజకవర్గం

– ఆలేరు శాసన సభ్యురాలు,రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత
నవతెలంగాణ- ఆలేరుటౌన్‌
గత పాలకుల నిర్లక్ష్యనికి లోనైన ఆలేరు నియోజకవర్గం, గత తొమ్మిది సంవత్సరాల నుండి అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆలేరు శాసన సభ్యురాలు రాష్ట్ర ప్రభుత్వ వైపు గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి అన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల పురస్కరించుకొని,నవ తెలంగాణతో ఆమె మాట్లాడారు. తన భర్త, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్‌ గొంగిడి. మహేందర్‌ రెడ్డి సహకారంతో గత 9 సంవత్సరాల నుండి ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి చేసిన పనుల గురించి వివరించారు. 9 సంవత్సరాల నుండి ఆలేరు నియోజకవర్గం లోని ప్రజలకు అందుబాటులో ఉంటూ, అభివృద్ధికి దాదాపు 3000 వేలకోట్ల రూపాయలు నియోజకవర్గానికి తీసుకువచ్చాను. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరణ పనులు చేపట్టాను. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు నియోజకవర్గంలో నింపాను. మల్లన్న సాగర్‌ ద్వారా, తుర్కపల్లి, బొమ్మల రామారం మండలాలకు సాగు, త్రాగునీరు, గుండాల మండలానికి రిజర్వాయర్‌ నుండి సాగు తాగునీరు అందేలా చేశాను. సాగుతూ ఆగు నీరు పంపిణీతో ఎడారిగా ఉన్న ఆలేరు నియోజకవర్గం, సస్యశ్యామలంగా మారింది పాడి పంటలతో ఆలేరు నియోజకవర్గం కళకళలాడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర పురపాలక శాఖామంత్రి, కేటీఆర్‌, ఆర్థిక శాఖామంత్రి, తన్నీరు. హరీష్‌ రావు, విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల.జగదీశ్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా శాసనసభ్యులు ఆలేరు నియోజకవర్గం లోని ప్రజా ప్రతినిధుల సహకారంతోమరింత అభివృద్ధి కొరకు ప్రణాళిక సిద్ధం చేశాను. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇస్తున్న హామీలు అమలు కానివని, మాయమాటలు చెబుతూ ప్రజలను అయోమయ స్థితి గురి చేసేందుకు కుట్ర చేస్తున్నారని , ప్రజలు ముఖ్యమంత్రి కెసిఆర్‌ సారాధ్యంలో జరుగుతున్న అభివృద్ధికి స్వాగతం తెలుపుతున్నారన్నారు. ఆలేరు నియోజకవర్గం లో 187 గ్రామాలకు బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వేశానని, పల్లె దావకాన ఏర్పాటు చేసి భవన నిర్మాణాలు చేపట్టానన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా 534 చెరువుల పూడికతీత ,39 చెక్‌ డ్యాముల నిర్మాణం జరిగిందన్నారు.గ్రామ పంచాయతీలకు 52 కొత్త భవనాలు నిర్మించామన్నారు. 39 కొత్త గ్రామపంచాయతీలుగా, తండాలు గూడాలను ఏర్పాటు చేశామన్నారు . వర్గంలో మూడు కోట్లతో మైనారిటీ లకు పీర్లకోట్టాలు , కబ్రిస్తాన్‌ ప్రహరీ గోడ ,నిర్మాణాలు, కుల సంఘాలకు భవనాలు, కమ్యూనిటీ హాల్స్‌ పెంచడం జరిగిందన్నారు. తుర్కపల్లి మండలంలో పొడు భూముల పంపిణీ విషమన్నారు మాటూరు గ్రామంలో 93 ఎకరాలకు వ్యవసాయ భూమి పట్టాల అందజేశామన్నారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలకు మరింత అభివృద్ధి పనులు సేవ చేసేందుకు మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, ప్రజల నుండి తమకు అపూర్వ స్పందన మద్దతు లభిస్తుందని చెప్పారు.సొంత నిధులతో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు ఎమ్మెల్యే గొంగిడి సునీత నా సొంత నిధులతో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటుతోపాటు పునాదిగాని కాలువ నిర్మాణానికి 56 లక్షలు వెచ్చించడం జరిగిందన్నారు. నీరుద్యోగ యువతకు ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో పోటీ పరీక్షల కొరకు, శిక్షణ తరగతులు ఏర్పాటు, ఉచితంగా పుస్తకాల పంపిణీ, పరిశ్రమలలో ఉద్యోగాల ఏర్పాటుకు క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లేందుకు మూడోసారి ఎమ్మెల్యేగా తనను గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలకి విజ్ఞప్తి చేశారు.

Spread the love