సీపీఐ(ఎం)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం

– విలేకర్ల సమావేశంలో డబ్బికార్‌ మల్లేశ్‌
నవతెలంగాణ-మిర్యాలగూడ
సీపీఐ(ఎం)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేశ్‌ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కొందరు పనిగట్టుకుని సీపీఐ(ఎం) అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పద్ధతిని మానుకోవాలని సూచించారు.సీపీఐ(ఎం) టికెట్‌ కేటాయించవద్దని చెప్పే హక్కు మీకు ఎవరు ఇచ్చారని అన్నారు. టికెట్‌ ఇచ్చే విషయంపై తమ పార్టీ రాష్ట్ర కమిటీ చూసుకుంటుందని , టికెట్‌ ఇవ్వద్దని చెప్పడం సరైనది కాదన్నారు. పైగా సీపీఐ(ఎం) అవమానపరిచే విధంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. మీ పార్టీ టికెట్టు అడుక్కోవాలంటే మీరు ఎక్కడైనా ధర్నా చేసుకోవచ్చని, ఎవరికైనా టికెట్‌ ఇవ్వాలని సూచించుకోవచ్చని, మీ టికెట్‌ కోసం మీ అధిష్టానం వద్ద ఏమైనా చేసుకోవచ్చని హితువు పలికారు. కానీ సిపిఎంకు టికెట్‌ ఇవ్వద్దని చెప్పడం సరైనది కాదన్నారు. దేశంలో రాష్ట్రంలో బిజెపి బీఆర్‌ఎస్‌ పార్టీలను ఓడించాలని లక్ష్యంతో ఇండియా కుటమిలో చేరామని, అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ కోరుకుంటుందని అందులో భాగంగానే దేశంలో రాష్ట్రంలో కలిసి పనిచేయాలని పార్టీలు నిర్ణయించుకున్నాయని తెలిపారు. పొత్తుల వల్ల రాష్ట్రంలో 40 నుంచి 50 స్థానాల్లో కాంగ్రెస్‌ కు కలిసి వస్తుందని, ఆ స్థానాల్లో సీపీఐ(ఎం)కు గెలుపు ఓటమిలు నిర్ణయించే స్థాయి ఉందన్నారు. సీపీఐ(ఎం)కు రెండు మూడు చోట్ల కాంగ్రెస్‌ సహకరిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. పార్టీలు కలిసి పని చేయాలనుకున్నప్పుడు టికెట్‌ ఎవరికి వచ్చినా ఒకరికి ఒకరు సహకరించుకోవాలని సూచించారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రవి నాయక్‌, డీివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్‌, జిల్లా కమిటీ సభ్యులు బావండ్ల పాండు, పాదురి శశిధర్‌ రెడ్డి, పొదిల శ్రీనివాస్‌, రెవిడాల బిక్షం, వెంకట్‌రెడ్డ్డి, వెంకటయ్య, ఎల్లయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Spread the love