– సభాఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలి: ఎస్పీ అపూర్వరావు
నవతెలంగాణ -మునుగోడు
ఈనెల 26న మునుగోడు మండలంలోని చౌటుప్పల్ రోడ్లో నిర్వహంచనున్న ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ రానున్నందున అవసరమైన ఏర్పాట్లను అధికారులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ అపూర్వరావ్ సభ ఏర్పాట్లను, హెలికాప్టర్ ల్యాండింగ్ స్థలమును, సభకు విచ్చేసే వాహనాలకు పార్కింగ్ స్థలం ను పరిచరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభ ఏర్పాటల్లో నిర్లక్ష్యం వహించకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు . సభ సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలకు అవసరమైన పార్కింగ్ స్థలం వద్ద సూచన బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు . హెలికాప్టర్ ల్యాండింగ్ స్థలంలో ఉన్న విద్యుత్ స్తంభాలను, వైర్లను తొలగించాలని అన్నారు . ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీధర్ రెడ్డి , ఎస్ బి డిఎస్ పి సొమ్ నారాయణ సింగ్ , చండూరు సిఐ వెంకటయ్య , ఎస్సై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.