- Advertisement -
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. శనివారం హైదరాబాద్ లోని తన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బడుగు, బలహీన వర్గాలు, పేదల జీవితాల్లో ఆయన వెలుగులు నింపారని సీఎం తెలిపారు.
- Advertisement -



