– బాధితునికి పూర్తిస్థాయిలో న్యాయం చేయని అధికారులు
– న్యాయం చేయాలని బాధితుడి బండి రామయ్య విజ్ఞప్తి
నవతెలంగాణ-బెజ్జంకి
అనుమతులు ఒకరికి ఉంటాయి. మరోకరు అక్రమంగా నిర్మాణాలు చేపడుతారు. ఇదేంటంటే అధికారుల అనుమతుల మేరకే నిర్మాణం చేపడుతున్నామని నిర్మాణదారులు బెదిరింపులకు గురిచేస్తారు. తీర నిర్మాణం పూర్తయ్యేవరకు అసలైన బాధితులకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగింది న్యాయం చేయాలని బాధితులు అధికారులకు పిర్యాదు చేస్తే.. ఫిర్యాదు మేరకు అక్రమ నిర్మాణ స్థలాన్ని సందర్శించి చట్టపరమైన చర్యలు చేపడుతామని బాధితునికి అధికారులు హామీ ఇస్తారు. అధికారులను నమ్ముకుని అమాయకుడైన బాధితుడు ఎదురుచూస్తాడు.కాలయాపనతో అధికారులు విధులు నిర్వర్తిస్తారు. సార్..న్యాయం చేయాలని అధికారుల చుట్టూ బాధితుడు తిరుగుతూనే ఉంటాడు.అధికారులు చర్యలు చేపడుతున్నట్టు అక్రమ నిర్మాణదారునికి నోటీసులు జారీ చేస్తారు.మేము నోటీసులు ఇచ్చినట్టే ఇస్తాం..నువ్వు తీసుకున్నట్టు తీసుకో లేకపోతే లేదు.మా విధి మేం నిర్వహిస్తున్నామంటే? నిర్వహిస్తున్నాం..అంటూ అక్రమ నిర్మాణదారుడికి వత్తాసు పలుకుతున్నారనేది జగమేరిగిన సత్యం. పిర్యాదు స్వీకరించిన అధికారులు మాత్రం చట్టపరమైన చర్యలు చేపట్టడంలో మా చేతుల్లో ఏమి లేదంటూ అధికారులు అంతంతా మాత్రంగానే వ్యవహరిస్తూ దాటవేసే దోరణి అవలంభిస్తున్నట్టు బాధితుల్లో వదంతులు వినిపిస్తున్నాయి.బాధితులకు అధికారులు న్యాయం చేస్తారా?లేకా అక్రమ నిర్మాణదారులకు దోచి పెడుతున్నారనేది మాత్రం అంతుచిక్కడం లేదు.మండల కేంద్రానికి చెందిన బాధితుడు బండి రామయ్య తన స్వంత స్థలాన్ని అక్రమించి ఇతరులు అక్రమ నిర్మాణం చేపడితే న్యాయం చేయాలని డిసెంబర్ 19,2022న సంబధిత అధికారులకు పిర్యాదు చేశాడు.అక్రమ నిర్మాణం చేపట్టిన స్థలాన్ని అధికారులు,గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి సందర్శించి అక్రమ నిర్మాణదారుడికి నాలుగు సార్లు నోటీసులు జారీ చేశారు.పిర్యాదు చేసి నెలలు గడుస్తున్న అధికారులు బాధితుడికి న్యాయం చేయడంలో అలసత్వం వహిస్తూ కాలయాపన చేస్తున్నారని..సమాచార హక్కు చట్టం ద్వార అక్రమ నిర్మాణదారుడిపై అధికారుల చేపట్టిన చట్టపరమైన చర్యల వివరాలడిగిన ఇవ్వడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.అక్రమ నిర్మాణదారుడికి అధికారులు అండగా నిలుస్తూ అన్యాయం చేస్తున్నారని ఇప్పటికైన సంబందిత జిల్లాధికారులు సత్వర స్పందించి అక్రమ నిర్మాణంపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు.అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టి బాధితునికి న్యాయం చేస్తారో?లేక అక్రమ నిర్మాణదారుడికి అండగా నిలిచి అన్యాయం చేస్తారో వేచి చూడాలి.
దృవపత్రాలు సమర్పిస్తే చర్యలు చేపడుతాం
బాధితుడు బండి రామయ్య పిర్యాదు మేరకు నిర్మాణదారుడికి నోటీసులు అందజేసి పనులు నిలిపివేశాం.బాధితుడి స్థలానికి సంబంధించిన అధికారిక అధారమైన దృవపత్రాలు సమర్పించాలని సూచించాం.నేటి వరకు దృవపత్రాలు బాధితుడు సమర్పించలేదు.దృవపత్రాలు సమర్పించిన వెంటనే చట్టపరమైన చర్యలు చేపడుతాం.