- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే ఆ గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం జన్నారం మండలంలోని దేవుని గూడా, చింతగూడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ముఖ్య కార్యకర్తలతో మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడగాలని అభ్యర్థులకు సూచించారు. మండలాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ సర్పంచులు గెలవాలన్నారు. వారి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



