నవతెలంగాణ-సదాశివపేట
పీఎంఆర్ అనగా ప్రజల మనిషి రాజు అని సుహాస్ ప్రాజెక్ట్స్ బిల్డింగ్ ట్రస్ట్ క్రియేటింగ్ ఎక్సలెన్స్ చైర్మన్ శ్రీమతి సామినేని అంజలి, శ్రీ కృష్ణ కొనియాడారు. పులిమామిడి రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లోని సుహాస్ ప్రాజెక్ట్స్ కార్యాలయంలో అంజలి–కృష్ణ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సంస్థ సిబ్బంది, మిత్రబృందం కలిసి పులిమామిడి రాజును శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి హర్షాతిరేకాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ, పులిమామిడి రాజు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, రానున్న రోజుల్లో పిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని ఆకాంక్షించారు. పేదలను చూసిన వెంటనే స్పందించే హృదయం ఆయనకు ప్రత్యేకతని, అలాంటి మనసున్న నాయకుడు సంగారెడ్డి జిల్లాకు దొరకడం ప్రజల అదృష్టమన్నారు.
భవిష్యత్తులో సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన గెలవాలని, ఆ భగవంతుడు ఆ కోరికను నెరవేర్చాలని అందరి తరపున ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పులిమామిడి రాజు చేసే ప్రతి మంచి పనికి తాము వెన్నంటి ఉంటామని, సుహాస్ ప్రాజెక్ట్స్ ఎల్లప్పుడూ ఆయన సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహేందర్, యాదయ్య, ప్రసాద్, నకుల్, రాగం అనిల్, సోమ శంకర్ తదితరులు పాల్గొన్నారు.



