Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు 

ఆలేరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు 

- Advertisement -

ఎండి సలీం కాంగ్రెస్ సీనియర్ నాయకులు 
నవతెలంగాణ – ఆలేరు 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం లోని 70% గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి సలీం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం నవతెలంగాణతో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య మార్నింగ్ వాక్ ద్వారా ప్రజల్లో ఉండడం ఇందిరమ్మ ఇండ్లు సన్నబియ్యం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్ల వరకు ఉచితవిద్యుత్ లాంటి పథకాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు మొదట నిర్మించిన వారికి పొట్టేలు బహుమతి ఇవ్వడం కూడా ఈ ఎన్నికల్లో విజయానికి దోహదం చేసిందన్నారు.

ఆలేరు ఎమ్మెల్యే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అహర్నిశలు కృషి చేయడం వల్లే గొప్ప విజయాలు సాధ్యమయ్యాయి అన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు శారాజిపేట్ లో కంతి మధు,గోలనుకొండలో యాదిరెడ్డి ఇక్కుర్తిలో కందుల చిరంజీవిని గెలిపించడానికి నాతోపాటు సీనియర్ నాయకులు ఎం.ఎస్ విజయ్ కుమార్ బిజిన భాస్కర్ఎన్నికల ప్రచారంలో ఇంటింటా తిరిగి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి తో పాటు వారు గెలిపించేందుకు కృషి చేశారని చెప్పారు. గెలుపొందిన ఆయా గ్రామాల సర్పంచ్లకు అభినందనలు తెలుపుతూ ఎమ్మెల్యే వద్ద మా మాట నిలబెట్టిన  ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -