Monday, December 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచేతివృత్తులకు ఇండియా క్రాఫ్ట్‌మేళా అండగా నిలవాలి

చేతివృత్తులకు ఇండియా క్రాఫ్ట్‌మేళా అండగా నిలవాలి

- Advertisement -

భారతీయ కళానైపుణ్యం ఉట్టిపడేలా క్రాఫ్ట్‌మేళా : మంత్రి తుమ్మల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భారతీయ కళా నైపుణ్యం గల చేతి వృత్తులు అంతరించకుండా ఇండియా క్రాఫ్ట్‌ మేళా అండగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పారామంలో ఆలిండియా క్రాఫ్ట్‌ మేళాని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలోని హ్యాండ్లూమ్‌ అవార్డు గ్రహీతలు, హ్యాండ్లూమ్‌ కంపెనీలకు, సహకార సంఘాలకు సంబంధించిన 100కి పైగా స్టాల్స్‌ ఏర్పాటు చేయడం గొప్పవిషయమన్నారు. ఈ మేళా జనవరి ఐదో తేదీ వరకు కొనసాగుతుందనీ, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా క్రాఫ్ట్‌ మేళాకు శిల్పారామం వేదికైందనీ, ప్రజలు క్రాఫ్ట్‌ మేళా సందర్శించి చేతి వృత్తుల వారిని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -