పెన్షనర్ల సమస్యలు పరిష్కరించే వారికే మా ఓటు

నవతెలంగాణ- కంఠేశ్వర్:
ఈపీఎస్ పెన్షనర్లకు ₹9000/- లు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల కు ఇంటీరియమ్ రిలీఫ్ 30% ఇస్తూ, నగదు రహిత వైద్యాన్ని ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేస్తామన్న వారికే రిటైర్డ్ ఉద్యోగుల మద్దతు ఉంటుందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కార్యవర్గం తీర్మానించింది. ఈ మేరకు గురువారం మల్లు స్వరాజ్యం ట్రస్టు భవనంలో సంఘం జిల్లా అధ్యక్షులు కే.రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్లను ఏ విధంగా మోసం చేసాయో చర్చించుకున్నారు. ఎంతో ఘనంగా ఇస్తానన్న అయ్యారు రాష్ట్ర ప్రభుత్వం ఐదు శాతంతో ఇచ్చి ముష్టి వేశారని, పెండింగ్ లో ఉన్న  డీ ఏ లను విడుదల చేయకుండా పెన్షనర్లను మోసం చేసిందని వారు అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆదేశాలిచ్చిన ఈపీఎస్ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో రూపాయి పెంచలేదని, గత పార్లమెంటు ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నీటి మీద రాతల మార్చాయని వారన్నారు. రాష్ట్రంలో 30 లక్షల పెన్షనర్ల కుటుంబ ఓట్లు ఉన్నాయని, అదేవిధంగా జిల్లాలో పెన్షనర్ల కుటుంబ ఓట్లు యాబై వేలకు పైగా ఉన్నాయని వారు ఈ ఎన్నికలలో కీలకంగా వ్యవహరిస్తారని వారు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు, ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్, కోశాధికారి ఈవియల్ నారాయణ ,జిల్లా నాయకులు లావు వీరయ్య, భోజారావు, ప్రసాదరావు, అద్దంకి హుషాన్, సిర్పా హనుమాన్లు , రాధా కిషన్ ,అశోక్, బాబా గౌడ్, శంకర్ ఇతరులు పాల్గొన్నారు.
Spread the love