Friday, December 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

– హాస కొత్తూర్ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
పశు వైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత మట్టాల నివారణ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని హాస కొత్తూర్ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో నిర్వహించిన ఉచిత నటన నివారణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుర్ల మేకల కాపరుల సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నటన నివారణ పంపిణీ కార్యక్రమాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా గొర్ల మేకల కాపరులు తమ జీవాలను అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు.

గొర్ల మేకల కాపరులు తమ జీవాలకు ప్రతి మూడు నెలలు ఒకసారి నట్టల నివారణ మందు వేయించాలని చౌట్ పల్లి పశువైద్యాధికారి డాక్టర్ వసంత్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్లు కుందేటి శ్రీనివాస్, ఏనుగు మనోహర్, గొర్ల కాపరుల సంఘం అధ్యక్షులు యెదుల మారుతి, బూతుపురం ఆదర్శ్, సభ్యులు గాడిద చిన్న అంజయ్య, గాడిద గంగన్న మామిడి చిన్నయ్య, మామిడి బక్కన్న, వెటర్నరీ అసిస్టెంట్ సత్యం, గోపాలమిత్త స్వరన్, గొర్ల మేకల కాపరులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -