- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన మంగలి కళావతి అనారోగ్యంతో మృతిచెందగా, బాధిత కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నదని తెలుసుకొని నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు నా రెడ్డి మోహన్ రెడ్డి స్పందించి సోమవారం వారి కుటుంబానికి రూ.2000, 50 కేజీల బియ్యాన్ని స్వచ్ఛంద సంస్థ ద్వారా అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దయానంద్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రగోతం రెడ్డి, నాయకులు స్వామి గౌడ్, సల్మాన్, మైసగౌడ్, దేవదాస్, కీసరి లక్ష్మణ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



