- Advertisement -
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల స్థాయి అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించినట్లు రామన్నగూడెం గ్రామ సర్పంచ్ బండి శ్రీను తెలిపారు. సోమవారం బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి, ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా గ్రామ అభివృద్ధి కోసం మీ వంతు సహకారాలు అందించాలని అన్నారు. నన్ను సర్పంచ్ గా గెలిపించేందుకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు. నాకు పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థి గా గుర్తింపు ఇచ్చి సర్పంచ్ భారీలో ఉంచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసం వెంకటేశ్వర్ రెడ్డి, మధు, కనకం వీరయ్య, పాశం అశోక్, రామకృష్ణ ,తో పాటు కొంతమంది పాల్గొన్నారు.
- Advertisement -



