- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని రెడ్డి పేట, రామారెడ్డి నూతన గ్రామపంచాయతీ పాలకవర్గానికి బుధవారం శాలువాలతో సన్మానం చేశారు. రెడ్డిపేటలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ నాగులపల్లి రాజేందర్ కు, ఉప సర్పంచ్ బుర్ర ప్రవీణ్ గౌడ్ కు, పాలకవర్గ సభ్యులకు, రామారెడ్డి లో మునూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ బండి ప్రవీణ్ కు, ఉప సర్పంచ్ హనుమయ్యల్ల నవీన్ కు, సన్మానం చేశారు. కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ నరేష్, కారోబార్ భానుచందర్, బీడీసీ అధ్యక్షులు లక్కాకుల బాల్నరసు, ఉపాధ్యక్షులు మాచర్ల రాజు, బద్ధి సతీష్, గ్రామస్తులు, మున్నూరు కాపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



