
– త్వరలో జరిగే ఎన్నికల్లో బాల్కొండలో కాంగ్రెస్ దే గెలుపు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం వేల్పూర్ మండలం కుకునూరు, కోమన్ పల్లి, వెంకటాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ గారు ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఆయన ప్రజలనుదేశించి మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గృహ విద్యుత్ అవసరాలకు ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు.మంత్రి ప్రశాంత్ రెడ్డి అవినీతి ధన దాహంతో ప్రజలను పట్టిపీడిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ గెలుపుతో బాల్కొండ నియోజకవర్గంలో బానిస సంకెళ్ల నుండి విముక్తి లభిస్తుందన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మంత్రికి బాల్కొండ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళ ఖాతాలో ప్రతినెల 2500 రూపాయలు జమ చేస్తామని తెలిపారు.రైతుకు పెట్టుబడి సాయం రైతు భరోసా ద్వారా ప్రతి ఎకరానికి సంవత్సరానికి 15000 రూపాయలు అందిస్తామని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12వేలు అందిస్తామని తెలిపారు.వృద్ధులకు వికలాంగులకు మహిళలకు పింఛను 4వేలు అందిస్తామని ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు.ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలం మరియు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల సాయం అందిస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అందిస్తామని ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.బిఆర్ఎస్ పార్టీని నమ్మి మోసపోయామని వందల కోట్ల రూపాయల అవినీతిని మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఈ ప్రభుత్వం చేసిందని ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని బాల్కొండ ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు