Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కన్నుల పండుగగా కళ్యాణోత్సవం 

కన్నుల పండుగగా కళ్యాణోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
మండలంలోని వెలుగొమ్ముల గ్రామంలో లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం కన్నుల పండుగగా కళ్యాణోత్సవం దేవాలయ చైర్మన్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తీర్థ ప్రసాద వితరణలో భాగంగా అన్నదాన కార్యక్రమం, స్వామివారి ఊరేగింపు, పల్లకి సేవ, మంత్రపుష్పం, నిర్వహించారు. భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సువర్ణ, దేవాలయ పాలక మండలీ సభ్యులు , గ్రామస్తులు రాజేందర్ రెడ్డి, బాబా,  మహేష్, సత్యం గౌడ్, కృష్ణయ్య, వార్డ్ మెంబర్లు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -