- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్ పర్సన్ గా నియమితులైన సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వారి ఇంటికి ఆహ్వానించి పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ , చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, దళితుల అభ్యున్నతి పలు అంశాలపై చర్చించారు.
- Advertisement -



