Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన మారంపల్లి అజయ్ కి ప్రభుత్వ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కును సర్పంచ్ రిక్కల అరుణ్ రెడ్డి అందజేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న మారంపల్లి అజయ్ ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి కృషితో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం చెక్కును మంజూరు చేసింది. అట్టి చెక్కును సర్పంచ్ అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారుడి ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. ఆర్థిక సహాయం చెక్కు మంజూరుకు కృషి చేసిన ముత్యాల సునీల్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లబ్ధిదారుడు అజయ్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ చిన్నోళ్ల రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -