
నవ తెలంగాణ-జక్రాన్ పల్లి
మాజీ ఐ సి డి ఎం ఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండలంలోని ముని పల్లి గ్రామానికి చెందిన సాయి రెడ్డి సొసైటీ డైరెక్టర్గా గెలుపొంది మునుపల్లి సింగిల్ విండో చైర్మన్గా కొన సాగుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఐ సి డి ఎం ఎస్ చైర్మన్గా కొనసాగారు. ఆనాటి నుంచి కాంగ్రెస్ నే ఉంటూ ఎటువంటి పార్టీ ఫిరాయింపులు చేయకుండా కాంగ్రెస్తో నమ్మకంగా ఉంటూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ముని పెళ్లి సింగిల్ విండో చైర్మన్ గా కొనసాగుతూనే ఉన్నారు. టిఆర్ఎస్ చేస్తున్న పనులను చూస్తూనే ఏమి చేయలేకపోయారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.