Sunday, April 26, 2026
E-PAPER
Homeకవితపిచ్చుకల గుంపు

పిచ్చుకల గుంపు

- Advertisement -

1.సున్నిత మనస్కుడై అతడు
కల్లోలితమైన ప్రపంచాన్ని
పదేపదే కలవరిస్తూ
మరణించిన తన ఒక్కొక్క కలకి
ఓ ముద్దు పెట్టుకుంటాడు
ప్రపంచం అంతమవుతే బాగుందని
ఆశపడుతూ ఆ రాత్రి నిద్రపోతాడు
2. అర్ధరాత్రి
సవ్వడి చేయకుండా ఓ సన్నటి సెలయేరు
అతని కంట చివర నుండి పారుతూ
హదయాన్ని తాకుతుంది
గాయాలన్నీ ఒక్కొక్కటిగా బయలు పడతాయి
ఎదురుచూపుల్లో తడిని కోల్పోయిన వాడై
తారసపడిన వాళ్లంతా ఎప్పటికైన
తప్పిపోయేవాళ్ళే అంటూ రెప్ప వాలుస్తాడు
ప్రపంచమంతా విశాలమైన అతడి హదయంలో
గులాబీ ముళ్ళులా ఆనవాళ్ళు
3. దూరానికి కోలమానం మర్చిపోయి
పరిగెడుతూ పరిగెడుతూ
విశ్రాంతి లేని జీవితానికి విరామం అంటూ
ఓ సుదీర్ఘ సాయంత్రాన రాలిపోవడానికి సిద్ధపడినవాడై
జీవితం తెల్లారితే వెళ్ళిపోయే కల అని
ముగింపు వాక్యం పలికేలోగా
ఓ పిచ్చుకల గుంపు అతడి వరండాలో వాలిపోతాయి.
– పి.సుష్మ, 9959705519

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -