ప్రతి ఒక్కరిలోనూ అధ్యయనం పెరగాలి : ఏఐకేఎస్ సీనియర్ నేత సారంపల్లి
నవతెలంగాణ ప్రాంతీయ ప్రతినిధి- ఖమ్మం
స్థానిక, భూ సమస్యలపై కేంద్రీకరించి రైతు సంఘం నాయకులు పనిచేయాలని ఏఐకేఎస్ సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సామినేని రామారావునగర్‌లోని కాసాని అయిలయ్య ప్రాంగణంలో జరుగుతున్న ఆ సంఘం రాష్ట్ర మూడో మహాసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని రైతు సంఘాల్లో కల్లా తెలంగాణ రైతు సంఘం అత్యంత నిర్మాణాత్మకమైనదన్నారు. అయితే, రైతు సంఘం నాయకులు మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా అధ్యయనాన్ని పెంచుకోవాలని సూచించారు. రైతాంగ సమస్యలను పరిష్కరించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అంతేకాదు, ఏ భూమిలో ఏయే పంటలు ఎలా పండించాలి? ఏ సీజన్‌లో ఏయే పంటలు వేయాలి? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ రకమైన విత్తనాలను వాడాలి? అని రైతు సంఘం నాయకు లను రైతులు అడిగేలా నాయకత్వం తయారు కావాలని ఆకాంక్షించారు. ఏటా 15 నుంచి 20 మంది పూర్తికాలం కార్యకర్తలను తయారు చేయాలన్నారు. యువ నాయకులను తీర్చిదిద్దాలన్నారు. వ్యవసాయ, విద్యుత్, బ్యాం కింగ్, నీటివనరులు, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రతి ఒక్క నాయకుడు కూడా పట్టు సాధించాలని సూచించారు. స్థానిక, భూ సమస్యల కేంద్రీకృతంగా పోరాటాలు చేయాలనీ, వాటిని పరిష్కరిం చడంలో కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. రైతు సంఘం నాయకుల దగ్గరకు వెళ్తే సమ స్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం రైతులకు కలగాలన్నారు.
స్థానిక, భూ సమస్యలపై కేంద్రీకరించి పనిచేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



