– వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలి
– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభలో 31 తీర్మానాలకు ఆమోదం
– పలు తీర్మానాలను ప్రవేశపెట్టిన ఎం.శోభన్‌నాయక్, బలపర్చిన వెంకట్‌రెడ్డి
– అర్హతల కమిటీ రిపోర్టును ప్రవేశపెట్టిన వి.వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ ప్రాంతీయ ప్రతినిధి – ఖమ్మం
ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేయాలనీ, వ్యవసాయ ప్రణాళికను రూపొందించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభ డిమాండ్ చేసింది. రాష్ట్ర మహాసభలో 31 తీర్మానాలను ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూఢ్ శోభన్ నాయక్ ప్రతిపాదించారు. వాటిని రాష్ట్ర నాయకులు వర్ణ వెంకట్‌రెడ్డి బలపర్చారు. మహాసభ 31 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వ్యవసాయ ప్రణాళికను శాస్త్రీయంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని రూపొందించాలనీ, రాష్ట్ర ప్రభుత్వం విత్తన చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తిచేయాలనీ, రుణమాఫీ చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకాన్ని రూపొందించాలనీ, వ్యవసాయ మార్కెట్ల చట్టాన్ని సవరించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. విదేశాల నుంచి పంటల దిగుమతులపై ఆంక్షలు విధించాలనీ, సన్న, చిన్న కారు రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలి వ్వాలనీ, పోడు పట్టాలివ్వాలనీ, మద్దతు ధరలు నిర్ణయించి కొనుగోలు గ్యారెంటీ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. శాస్త్రసాంకేతిక సాయం అందించి విత్తన రక్షణ, మహిళా రైతులకు భూ హక్కులు, హార్టికలర్చర్ పంటలను ప్రోత్సహించాలనీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు అదనపు ఆదాయం అందేలా చూడాలని విన్నవించారు. చెరుకు మిల్లులను తెరిపించాలనీ, తగినన్ని శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
రైతు కమిషన్ పనితీరును పటిష్ట పర్చాలనీ, ఎరువులను సకాలంలో సరఫరా చేయాలనీ, వ్యవసాయ ఉత్పత్తులో ధరల నిర్ణయాక సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మిర్చిబోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మామిడి రైతులకు న్యాయం చేయాలనీ, పసుపు బోర్డుకు నిధులు కేటాయించాలని కోరారు. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి బలోపేతం చేయాలనీ, పామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హతల కమిటీ రిపోర్టును వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టారు.
ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



