– వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు, శివపార్వతుల కల్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ముందుగా వాసవి మాత ఆలయంలో నిర్వహించిన శివపార్వతుల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ వాసవి మాత వైశ్య సమాజానికి ఆరాధ్య దైవమని, ఆమె త్యాగం, ధర్మం, సమానత్వానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైశ్యుల ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించేందుకు కట్టుబడి ఉందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వాసవి కన్యక పరమేశ్వరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం గర్వకారణమని, ఈ నిర్ణయం ద్వారా వైశ్య సమాజానికి తగిన గౌరవం లభిస్తుందని తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు.” ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మెన్ కైలాష్ శ్రీనివాస్, ,కౌన్సిలర్స్ కాళ్ళ గణేష్, కళ్లెం సత్యం ,వాజీద్ ,మజీద్ ,జావీద్, లడ్డు, చిట్టి బాబు ,పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు సందీల్, గొనె శ్రీనివాస్ ,గాజి ,అశోక్ రెడ్డి , ఆర్యవైశ్య సంఘ సభ్యులు భూమేష్, శ్రీనివాస్, రాజు, శ్రీధర్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.



