Sunday, April 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేద విశ్వబ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకోండి

నిరుపేద విశ్వబ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకోండి

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ 
మండలంలోని చేపూర్ గ్రామానికి చెందిన వడ్ల రాజేందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఆదివారం కోరారు. గొంతు క్యాన్సర్ తో బాధపడుతూ.. హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు అయినట్టు బాదితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మరింత మెరుగైన చికిత్సకు దాదాపుగా రూ. 2 లక్షలు అవసరమని వారు తెలిపారు. ఆయనది నిరుపేద కుటుంబమని, భార్యా, కూతురు ఉన్నారని, ఎలాంటి ఆస్తులు లేవని, ఆ పేద కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. దాతలు 9912933861 ఫోన్ పే నంబర్ కు సహాయం అందించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -