భారీగా తరలివచ్చిన భక్తులు
నవతెలంగాణ-మిడ్జిల్
మండల కేంద్రంతో పాటు బోయిన్పల్లి, వాడ్యాల్, మున్నానూర్, వల్లభరావు పల్లి, వేముల, మసి గుండ్లపల్లి, కొత్తూరు, వెల్గోముల, కాంచనపల్లి తదితర శుక్రవారం మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీర్లను ఎత్తుకొని ఇల్లు ఇల్లు తిరుగుతూ భక్తులు ముక్కులు తీర్చుకున్నారు. బోయినపల్లి, మున్నానూర్ గ్రామాలకు చెందిన పేర్లు వాడియాలకు రావడంతో గ్రామం అంతా జన సందడితో నిండిపోయింది మహిళలు బతుకమ్మలతో పీర్ల చావడి పాటలు పాడుతూ ఆనంద ఉత్సవంగా జరుపుకున్నారు.
ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా జడ్చర్ల ఇన్చార్జి సిఐ నరసింహ, మిడ్జిల్ ఎస్సై శ్రీనివాసులు , భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, శశికళ, చంద్రయ్య గౌడ్, సుజాత మల్లికార్జున రెడ్డి, రాములు, అన్ని పార్టీల మండల నాయకులు ప్రజాసంఘాల నాయకులు, యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



