Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదకద్రవ్యాలు, సైకో ట్రోఫీక్ పదార్థాలపై విద్యార్థులకు అవగాహన 

మాదకద్రవ్యాలు, సైకో ట్రోఫీక్ పదార్థాలపై విద్యార్థులకు అవగాహన 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను 
మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా, కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాలపై అవగాహన కార్యక్రమం ఆలేర్ పట్టణంలో శుక్రవారం  మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ పాఠశాల మరియు కళాశాల నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్  యాలాద్రి మాదకద్రవ్యాల ప్రభావాలు, విద్యార్థుల ఆరోగ్య విద్య, మానసిక ప్రవర్తనపై విద్యార్థులకి అవగాహన కల్పించారు.

యువత విద్యార్థులు డ్రగ్స్, మత్తుమందులు, గంజాయి మద్యం వంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దన్నారు. ప్రజలకు డ్రగ్స్ బారిన పడొద్దని అవగాహన కల్పించారు. జూన్ 26 అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. డ్రగ్స్ వాడడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. గ్రామాల్లో గంజాయి, డ్రగ్స్ పై అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో  బీసీ వెల్ఫేర్ పాఠశాల, కళాశాలల అధ్యాపకులు,ఉపాధ్యాయులు,పోలీస్ సిబ్బంది, ప్రజలు, యువకులు, ఆటో డ్రైవర్లు,  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -